POLICE BBMA NEWS

LATEST / తాజా వార్తలు
📢 రిపోర్టర్ ఖాళీలు (Reporter Vacancy): మా టీమ్‌లో చేరండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి! 🔥 Police News: High alert in the city, new security guidelines issued. 🔴 బ్రేకింగ్ న్యూస్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 💼 Job Alert: New vacancies for content writers in our news desk.

కమలాపూర్‌లో ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణ

కమలాపూర్‌లో ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి

Oplus_131072 కమలాపూర్, బిబిఎంఏ న్యూస్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయం వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగనుంది. ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత వికేంద్రీకరించి, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మండల పరిధిలోని ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ ప్రజావాణికి తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, వ్యవసాయ, వైద్య, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ తదితర శాఖలకు చెందిన 27 మంది మండల స్థాయి అధికారులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *