POLICE BBMA NEWS

LATEST / తాజా వార్తలు
📢 రిపోర్టర్ ఖాళీలు (Reporter Vacancy): మా టీమ్‌లో చేరండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి! 🔥 Police News: High alert in the city, new security guidelines issued. 🔴 బ్రేకింగ్ న్యూస్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 💼 Job Alert: New vacancies for content writers in our news desk.

TELANGANA POLICE E:NEWS BBMA //విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి: కాడపాక అనిల్ స్వేరో

TELANGANA POLICE E:NEWS BBMA //

విలేకరిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి: కాడపాక అనిల్ స్వేరో

చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలో ఆర్‌.బి. ఛానల్‌కు సంబంధించిన విలేకరి పుల్ల రవితేజపై జరిగిన దాడి ఘటనను కాడపాక అనిల్ స్వేరో తీవ్రంగా ఖండించారు. విలేకరి ఇంట్లోకి చొరబడి దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన పుల్ల రవితేజ గత 20 సంవత్సరాలుగా జర్నలిజం రంగంలో పనిచేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితుడికి న్యాయం చేయాలని, దాడి చేసినట్లు నిర్ధారణ అయిన వ్యక్తులపై సంబంధిత చట్టాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కాడపాక అనిల్ స్వేరో డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందన్నారు.

NATIONAL BUREAU CHIEF

BOJJAM RAMESH

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *