సురయ్యపల్లి అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలపై కసరత్తు

సురయ్యపల్లి, ఆగస్టు 17 (బిబిఎంఏ న్యూస్): సురయ్యపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి గ్రామాభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. రైతులు తమ పొలాలకు సులభంగా చేరుకునేందుకు అవసరమైన రోడ్డు మార్గాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్పంచ్ ఆర్ల నాగరాజు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడతామన్నారు. గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొని పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు.