రాజీవ్ గాంధీ జయంతి జయంతికి రోగులకు పండ్ల పంపిణీ

కమలాపూర్, బిబిఎంఏ న్యూస్: మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కమలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా బస్టాండ్ సమీపంలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కమలాపూర్లోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.