POLICE BBMA NEWS

LATEST / తాజా వార్తలు
📢 రిపోర్టర్ ఖాళీలు (Reporter Vacancy): మా టీమ్‌లో చేరండి, ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి! 🔥 Police News: High alert in the city, new security guidelines issued. 🔴 బ్రేకింగ్ న్యూస్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 💼 Job Alert: New vacancies for content writers in our news desk.

పెరియార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: బొంకూరి మధు

గోదావరిఖని, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 21: సామాజిక సమానత్వం, మూఢనమ్మకాల నిర్మూలన, మహిళలకు సమాన హక్కులు, వితంతు స్త్రీల పునర్వివాహాల కోసం పోరాడిన పెరియార్ ఈ.వి. రామస్వామి గొప్ప మానవతావాది అని సీనియర్ జర్నలిస్టు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు అన్నారు. శుక్రవారం చెన్నైలోని పెరియార్ సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పెరియార్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పెరియార్ సిద్ధాంతాలను గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కృషి చేస్తుందని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *