30వసారి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న బత్తుల రాజు

పెద్దపల్లి, బిబిఎంఏ న్యూస్, ఆగస్టు 21: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కమాన్పూర్కు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ బత్తుల రాజు పాల్గొని రెడ్క్రాస్ సంస్థకు 30వసారి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో రాజు నిరంతరం రక్తదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, తోటి ఫోటోగ్రాఫర్లు ఆయనను అభినందించారు. సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధతను పలువురు కొనియాడారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.